నియంత్రణ కోల్పోయి భూవాతావరణంలోకి వచ్చిన చంద్రయాన్‌-3 లాంచర్‌ విడిభాగం

Telugu Lo Computer
0


చంద్రయాన్‌-3 స్పేస్‌ క్రాఫ్ట్‌ను నింగిలోకి తీసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ విడిభాగం (క్రయోజనిక్‌ అప్పర్‌ స్టేజ్‌) ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. బుధవారం మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో ఇది భూ వాతావరణంలోకి వచ్చినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది.ఈ ఏడాది జూలైలో చంద్రయాన్‌ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే. లాంచింగ్‌ చేసిన 124 రోజుల తర్వాత రాకెట్‌ విడిభాగం భూ వాతావరణంలోకి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)