2025లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు !

Telugu Lo Computer
0


2025లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎనిమిది జట్ల మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఆడే ఎనిమిది జట్లు ఈ ఏడాది ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాయి. అవి : భారతదేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. తద్వారా ఆతిథ్య దేశం కావడంతో పాకిస్థాన్ ఆతిథ్య దేశంగా అర్హత సాధించింది. పాకిస్థాన్‌తో పాటు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలే స్టేజ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆందోళన చెందింది. కానీ, గత రెండు మ్యాచ్‌లలో, ఇంగ్లండ్ మంచి పునరాగమనం చేసింది. రెండు మ్యాచ్‌లలో గెలిచి దిగువ నుంచి 7వ స్థానానికి చేరుకుంది. చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్‌లో నిర్వహించారు. ఆ ఎడిషన్‌లో అంటే 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగలేదు. 8 ఏళ్ల తర్వాత ఈ మెగా ICC టోర్నీకి 2025లో పాకిస్థాన్‌లో ఆతిథ్యం ఇవ్వనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)