సన్ టీవీ షేర్లు భారీగా పెరుగుదల !

Telugu Lo Computer
0


సన్ టీవీ అధినేత కళానిధి మారన్ ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోవటంతో వార్తల్లో నిలిచారు. సూపర్ స్టార్ రజనీతో తీసిన జైలర్ సినిమాతో వార్తల్లో మారుమోగిపోయారు. తాను సినిమా నుంచి వచ్చిన లాభాలను ప్రాజెక్టులో పనిచేసిన అందరికీ పంచటంతో పాటు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్లకు ఖరీదైన బహుమతులు, క్యాష్ రివార్డులు అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలోనే మీడియా పరిశ్రమలో సౌత్ ఇండియాలో అగ్రగామి కంపెనీగా కొనసాగుతున్న సన్ టీవీ షేర్లు మూడు నెలల కాలంలో 40 శాతానికి పైగా పెరిగాయి. ఈ పెరుగుదలతో సన్ టీవీ యజమాని కళానిధి మారన్ ఆస్తుల విలువ తారాస్థాయికి చేరుకున్నాయి. రానున్న మూడు, నాలుగు వారాల్లో సన్ టీవీ షేర్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూలై 5న రూ.443గా ఉన్న సన్ టీవీ షేరు ధర ఈరోజు 0.77 శాతం లాభపడి రూ.620.30 వద్ద కొనసాగుతున్నాయి. గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు 45 శాతం మేర రాబడిని అందించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.24,450 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ తరుణంలో వాల్డ్ డిస్నీ సంస్థ తన భారత టీవి, స్ట్రీమింగ్ వ్యాపార ఆస్తులను అమ్మేందుకు సన్ టీవీని సంప్రదించినట్లు వెల్లడైంది. సన్ టీవీలో మారన్, అతని కుటుంబ సభ్యులకు 75 శాతం వాటాలు ఉండటంతో వారి సంపద తాజాగా భారీ పెరుగుదలను చూసింది. ఈ క్రమంలోనే సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కళానిధి మారన్ నికర విలువ దాదాపు 2.9 బిలియన్ డాలర్లకు చేరుకోవటంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 1031వ స్థానంలో నిలిచారు. 1990లో కళానిధి మారన్ కళానిధి మారన్ బూమలై అనే తమిళ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో టెలివిజన్ ఛానెల్‌ని ప్రారంభించటంతో దశ తిరిగింది. అలా తర్వాతి కాలంలో సినిమాల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)