కంపెనీలు కుమ్మక్కై స్టీల్, సిమెంట్ ధరలు పెంచేస్తున్నాయి !

Telugu Lo Computer
0


నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేకపోవడంతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల (డీపీఆర్‌) తయారీలో భారత జాతీయ హైవే అధారిటీ (ఎన్‌హెచ్ఏఐ) ఇబ్బందులు ఎదుర్కొంటోందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. నూతన టెక్నాలజీల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్ 2023ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. స్టీల్‌, సిమెంట్ పరిశ్రమలో దిగ్గజాలు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచుతున్నారని మండిపడ్డారు. డీపీఆర్‌లు సిద్ధం చేయడంలో ఎన్‌హెచ్ఏఐకి ప్రధాన సమస్యగా మారిందని, ఏ ప్రాజెక్టుకూ సరైన డీపీఆర్ లేదని చెప్పారు. డీపీఆర్‌లు రూపొందించే కంపెనీలు నూతన టెక్నాలజీ, పరిశోధనని అంగీకరించడం లేదని, డీపీఆర్‌ల ప్రమాణాలు కూడా పడిపోయాయని అన్నారు. చైనాలో రవాణా వ్యయం 8-10 శాతం ఉంటే భారత్‌లో ఇది 14-16 శాతంగా ఉందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)