క్రియాశీల రాజకీయాలకు నీలేష్ రాణే గుడ్ బై !

Telugu Lo Computer
0


హారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ రాణే తనయుడు  నీలేష్ రాణే యాక్టివ్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. `యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి దూరం కావడానికి ఎటువంటి కారణం లేదు. నేను ఇంత కంటే ఎక్కువగా పాలించలేను` అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్ (మాజీ ట్విట్టర్)'లో పోస్ట్ చేశారు. 2019-20లో ప్రజల నుంచి తనకు ప్రేమాభిమానాలు దక్కాయని, అందుకు వారికి చాలా వరకూ రుణ పడి ఉంటానని పేర్కొన్నారు నీలేశ్ రాణె. ప్రజల ప్రేమాభిమానాలను పొందడానికి బీజేపీ వంటి పార్టీలో పని చేసే అవకాశం లభించిందని పోస్ట్ చేశారు. 'నేను రాజకీయాల్లో చాలా నేర్చుకున్నా. కొందరు సహచరులు జీవితకాలం నా కుటుంబ సభ్యులుగా నిలిచిపోయారు. నా జీవితంలో వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటా' అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. 'ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాకు ఆసక్తి లేదు' అని కూడా పేర్కొన్నారు. 'విమర్శలు ఎల్లవేళలా విమర్శలే. అటువంటి వాటితో నా టైం గానీ, ఇతరుల టైం గానీ వేస్ట్ కానివ్వదల్చుకోలేదు. నా మనస్సుకు నచ్చని పనులు చేయాలని భావించడం లేదు' అని తెలిపారు. తన వల్ల జరిగిన పొరపాట్లతో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరారు. నీలేశ్ రాణె సోదరుడు నీతేష్ రాణె ప్రస్తుతం మహారాష్ట్రలోని కంకావళి స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నీలేశ్ రాణె ఇంతకుముందు 15వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున రత్నగిరి-సింధుర్గ్ నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి వినాయక్ రౌత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత బీజేపీలో చేరారు నీలేశ్ రాణె.

Post a Comment

0Comments

Post a Comment (0)