పొగమంచు కారణంగా వాహనాలు ఢీకొని ఏడుగురి మృతి

Telugu Lo Computer
0


మెరికాలోని లూసియానాలో ఒక అంతర్ రాష్ట్ర రహదారిపై భారీగా కురుస్తున్న పొగ మంచు వల్ల సుమారు 150 వాహనాలు ఢీకొట్టాయి. ఫలితంగా ఏడుగురు మరణించారు. మరో 25 మందికి పైగా గాయ పడ్డారు. న్యూఓర్లానో సమీప పాంట్ చార్ట్రెయిన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలం వద్ద కార్లు, భారీ వాహనాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వాహనాలు దాదాపు 30 నిమిషాలు ఒకదానిని మరొకటి ఢీకొట్టాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక కారు ఏకంగా వంతెన పై నుంచి నీటిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆ కారు డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడని తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఆయా వాహనాల డ్రైవర్లు రహదారిపైకి వచ్చి తమకు సాయం చేయాలంటూ కేకలు వేశారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే భారీగా సహాయ బృందాలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. లూసియానా పోలీసులు ఈ ప్రమాద ఫోటోల ఏరియల్ షాట్లను ఫేస్‪బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు లూసియానా పోలీసులు తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర రవాణాశాఖతో సమన్వయంతో దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 11 మైళ్ల దూరం వరకూ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పొగ మంచు వల్ల 10వ నంబర్ అంతర్ రాష్ట్ర రహదారిని మూసివేసే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో కార్చిచ్చు పొగ, సాధారణ పొగ మంచుతో కలిసి పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయని జాతీయ వాతావరణ సేవల సంస్థ తెలిపింది. పొగ మంచు కురుస్తున్న నేపథ్యంలో న్యూ ఓర్లానో ప్రాంత స్కూళ్ళను మూసివేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)