వాట్సాప్ లో బిజినెస్ ఇండికేటర్ ఫీచర్ !

Telugu Lo Computer
0


ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ యాప్ లలో యాడ్స్ ను క్రియేట్ చేసే వారి వాట్సాప్ బిజినెస్ అకౌంట్లలో ''బిజినెస్ ఇండికేటర్'' అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఫేస్ బుక్, ఇన్ స్టా యాడ్స్ కు సంబంధించి కస్టమర్లతో ఛాట్ చేసేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను క్లియర్ చేసేందుకు, ఫీడ్ బ్యాక్ ను తెలుసుకునేందుకు 'బిజినెస్ ఇండికేటర్' ఫీచర్ ను వాట్సాప్ వినియోగించనుంది. ఈ మేరకు ఈ ఫీచర్ లో ఆప్షన్లు ఉంటాయి. తాజాగా WABetaInfo వెబ్ సైట్ ప్రచురించిన ఒక న్యూస్ స్టోరీలో ఈవివరాలను పొందుపరిచారు. ఒక స్క్రీన్ షాట్ ను కూడా అందులో పోస్ట్ చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఇవన్నీ జుకర్ బర్గ్ కు చెందిన మెటా గ్రూప్ పరిధిలోకి వస్తాయి. మెటా గ్రూప్ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకే ఈ ఫీచర్ ను జోడించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.23.19.15 వర్షన్ లో టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ మరో కొత్త గ్రూప్ ఫీచర్‌ను కూడా డెవలప్ చేస్తోంది. దాని పేరే గ్రూప్ చాట్ ఈవెంట్స్‌. దీనితో మనం ఈవెంట్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు, వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక వాట్సాప్ గ్రూపులోకి వెళ్లి అటాచ్‌మెంట్ ఐకాన్‌పై క్లిక్ చేసినప్పుడు చివరి ఆప్షన్‌గా పోల్ కనిపిస్తుంది. త్వరలో దాని పక్కనే 'ఈవెంట్' ఆప్షన్ కనిపిస్తుంది. ఈవెంట్‌పై నొక్కి మనం ఏదైనా ఒక ఈవెంట్ ను క్రియేట్ చేయొచ్చు. దానికి ఒక పేరును పెట్టొచ్చు. బర్త్ డే పార్టీ, మీటింగ్, సినిమా నైట్, మ్యారేజ్ ఫంక్షన్ ఇలా మనం ఏది చేయబోతున్నామో ఆ పేరును పెట్టుకోవాలి. వాట్సాప్ గ్రూప్ చాట్‌లో దాని గురించి ఎప్పుడు గుర్తు చేయాలి ? అనే తేదీని, టైంను కూడా ముందుగానే సెట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందనే స్క్రీన్‌షాట్‌ లను ఇప్పటికే వాట్సాప్ బీటా ఇన్ఫో విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)