సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ మరింత పటిష్టం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 15 October 2023

సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ మరింత పటిష్టం !


రిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌తో సహా బంగ్లాదేశ్‌, మయన్మార్‌, నేపాల్‌లతో ఉన్న ఎనిమిది సరిహద్దు చెక్‌పోస్టుల్లో రేడియేషన్‌ డిటెక్షన్‌ పరికరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అణు పరికరాల తయారీ కోసం ఈ రేడియోధార్మిక పదార్థాలు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. పాకిస్తాన్‌ సరిహద్దులోని సమీకృత చెక్‌పోస్టులు, అటారీలోని ల్యాండ్‌ పోర్టులు, బంగ్లాదేశ్‌ సరిహద్దులోని పెట్రాపోల్‌, అగర్తలా, డాకీ, సుతార్‌కండీ, నేపాల్‌ సరిహద్దులోని రాక్సువల్‌ జోగ్‌బానీ, మయన్మార్‌లోని మోరే పోర్టుల్లో ఆర్‌డీఈ సాంకేతికత ఏర్పాటు చేయనున్నారు. ఈ పరికరాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వ ఇప్పటికే ఒప్పందం చేసుకుందని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దు చెక్‌పోస్టుల్లో ప్రజల, వస్తువుల కదలికలను ఈ ఎనిమిది ఐసీపీల ద్వారా పర్యవేక్షించవచ్చు. ట్రక్కులతోపాటు ఇతర వస్తురవాణా మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక అలారం వ్యవస్థతోపాటు అనుమానిత వస్తువుల వీడియో ఫ్రేములను రూపొందించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ వ్యవస్థతో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి రేడియోధార్మిక పదార్థాలను అక్రమంగా తరలించే ప్రక్రియకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సాంకేతిక కోసం అమెరికాతోపాటు ఇతర దేశాల ఏజెన్సీల సహాయాన్ని తీసుకుంటోంది.

No comments:

Post a Comment