జాబితాలో పేరు రాకపోవడంతో ప్రచారం మధ్యలోనే ఆపేసిన మల్ రెడ్డి రంగారెడ్డి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 15 October 2023

జాబితాలో పేరు రాకపోవడంతో ప్రచారం మధ్యలోనే ఆపేసిన మల్ రెడ్డి రంగారెడ్డి !

తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కొంత మంది పేర్లు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మొదటి లిస్ట్ లో మాజీ మంత్రి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, కొండా సురేఖ పేర్లు లేవు. ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా మొదటి జాబితాలో స్థానం దక్కలేదు. దీంతో వారు ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టికెట్ ఆశిస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డి పేరు మొదటి లిస్ట్ లో రాలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మల్ రంగారెడ్డి తన ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడ గ్రామంలో తమ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ మొదటి జాబితా వచ్చింది. అయితే లిస్ట్ తన పేరు లేకపోవడంతో ఆయన ప్రచారాన్ని ఆపేసి వెళ్లిపోయారు. ఆయన అనుచరులు మల్ రెడ్డి రంగారెడ్డికి టికెట్ వస్తుందో రాదో అనే ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్ ఆదివారం 55 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. ఇందులో 11 మంది కొత్తగా టికెట్లు దక్కించుకున్నారు. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండగా, మదిర నుంచి భట్టి విక్రమార్క బరిలోకి దిగుతున్నారు. ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన మైనంపల్లి బంపర్ ఆఫర్ కొట్టారు. ఆయనకు మల్కాజిగిరి నుంచి టికెట్ రాగా.. కొడుక్కు రోహిత్ కు మెదక్ స్థానం కేటాయించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజుర్ నగర్ నుంచి.. ఆయన సతీమణికి కోదాడ నుంచి టికెట్ లభించింది. మొదటి జాబితాలో కొండ దంపతుల పేరు రాకపోవడంపై వారు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ 2018 సెప్టెంబర్ 6వ తేదీన శాసనసభ రద్దు చేసి అదే రోజు 105 మంది పార్టీ సభ్యులతో తొలి జాబితా విడుదల చేశారు. అప్పుడు కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తొలి జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

No comments:

Post a Comment