పొట్టలో సమస్యలు - చర్మ రోగాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 28 October 2023

పొట్టలో సమస్యలు - చర్మ రోగాలు !


పొట్టలో సమస్యలు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ, ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలాగంటే కడుపు ఆరోగ్యం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. తామర అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ తామర కూడా కడుపు ఆరోగ్య సమస్యలలో ఒక భాగమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్టలో మంచి బ్యాక్టీరియా సమతుల్యం అదుపుతప్పినప్పుడు కూడా తామర వచ్చే అవకాశం ఉంది. తామర లక్షణాలు అసాధారణంగా చర్మం పొడిబారడం, దురద, పొక్కులు, చర్మం పొరలుగా ఏర్పడటం వంటిది జరుగుతుంది. ఇది శరీరంలో ఎక్కడైనా సంభవించవచ్చు. మొటిమలు కడుపు నొప్పి కారణంగా సంభవించే మరొక చర్మ సమస్య. మొటిమలు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. అందులో ఒకటి పొట్ట చెడిపోవటం కూడా. శరీరానికి అవసరం లేని పదార్ధాలు, అలాగే టాక్సిన్స్, పొట్ట జీర్ణించుకోలేక బయటకు పంపలేకపోతే చర్మం ద్వారా విసర్జించబడతాయి. ఇది మొటిమలకు కారణం కావచ్చు. సోరియాసిస్ అనేది మందపాటి, పొడి, దురదతో కూడిన చర్మ సమస్య. దీని కారణంగా చర్మం పొరలు పొరలుగా ఉంటుంది. సోరియాసిస్‌కు కారణమేమిటో ఇప్పటికీ సరైన ఆధారాలు లేవంటున్నారు. కానీ పొట్ట పాడైపోయినప్పుడు కొందరికి సోరియాసిస్ సోకినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ రకమైన సమస్యలను నివారించడానికి, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అవసరం. మొదట మీరు ఒత్తిడిని ఎదుర్కోవాలి. దానికి అలవాటుపడాలి. కడుపుని దెబ్బతీసే ముఖ్యమైన అంశం ఒత్తిడి. అలాగే సరైన పోషకాహారంపై దృష్టిపెట్టాలి. సమయానికి సమతుల్య, పోషకమైన భోజనం తినండి. ఎక్కువ ఆహారం తీసుకోవడం కాదు – ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోవాలి.  తినే ఆహారం సరైనదైతే అది చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. చక్కెర, ప్రాసెస్డ్ ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా తినండి. మొలకలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. నీరు పుష్కలంగా తాగాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. 

No comments:

Post a Comment