రాజీవ్ గాంధీ, కెంపేగౌడ ఎయిర్ పోర్టులకు అరుదైన ఘనత !

Telugu Lo Computer
0


హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ విమానాశ్రయానికి చోటు లభించింది. ఈ జాబితాలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం ఆన్-టైమ్ పనితీరుపై నివేదిక విడుదల చేసింది. మొదటి ఐదు స్థానాల్లో ఉన్న ఇతర విమానాశ్రయాల విషయానికొస్తే మొదటి స్థానం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, రెండో స్థానంలో ఉటా (యూఎస్) లోని సాల్ట్ లేక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక మూడో స్థానంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. నాల్గో స్థానంలో మిన్నియాపాలిస్- St. పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా.. ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయం ఐదో స్థానంలో నిలిచింది. "బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు సమయానుకూలంగా బయలుదేరే అనుభవాన్ని కలిగి ఉంది. జూలైలో 87.51%, ఆగస్టులో 89.66%, సెప్టెంబర్‌లో 88.51% సమయపాలనను కలిగి ఉంది" అని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్" అని అనలిటిక్స్ సంస్థ పేర్కొంది. ఇవి షెడ్యూల్ చేసిన సమయానికి 15 నిమిషాలలోపు బయలుదేరిన విమానాల శాతం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయ సమయపాలనను సూచిస్తుందని సీరియం నివేదికలో పేర్కొంది. ఐదో స్థానంలో ఓస్లో విమానాశ్రయం గార్డెర్మోన్ (నార్వే) ఉంది. డెట్రాయిట్ మెట్రోపాలిటన్ వేన్ కౌంటీ విమానాశ్రయం (యూఎస్) ఆరో పోజిషన్ లో ఉండగా.. హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం (యూఎస్)ఏడో స్థానంలో ఉంది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహా, ఖతార్ 8వ స్థానంలో ఉండగా సీటెల్-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం (యూఎస్) 9వ స్థానంలో నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)