హాకీ క్రీడా చరిత్రను చాటిచెప్పేందుకు ప్రత్యేక సెషన్లు !

Telugu Lo Computer
0


హాకీ క్రీడా చరిత్రను చాటిచెప్పేందుకు ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ లేఖలో  ఆదేశించింది. భారతీయ హాకీ చరిత్రను, దాని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ చాటిచెప్పాలని రాష్ట్రంలోని కళాశాలలను కోరింది. అందుకు ప్రతి సోమవారం పాఠశాల ఆవరణాల్లో విద్యార్థి సమ్మేళనాన్ని నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రభుత్వేతర కళాశాలలు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు రాష్ర ఉన్నత విద్యాశాఖ లేఖ రాసింది. ఆ సమయంలో విద్యార్థులు చదవాల్సిన ముసాయిదా సందేశాన్ని కూడా రాసి పంపింది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు జే నారాయణ్ మిశ్రా స్పందిస్తూ.. "ఆదివాసి యువకులు హాకీ ఆడే సుందర్‌గఢ్, సంబల్‌పూర్, జార్సుగూడ జిల్లాలలో గిరిజన యువకుల ఓట్లు పొందడం కోసం చేస్తున్న ప్రయత్నమని ఎద్దేవా చేశారు. ముందుగా అన్ని పాఠశాలల్లో హాకీ కిట్లు, విద్యార్థులు ఆడేందుకు కావాల్సిన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)