వేగంగా దూసుకొచ్చి కారును ఢీ కొట్టిన బస్సు !

Telugu Lo Computer
0


శ్చిమబెంగాల్‌ లోని కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బస్సు సిగ్నల్‌ను జంప్‌ చేసి ముందు వేరే దిశలో వెళ్తున్న కారుపైకి దూసుకెళ్తుంది. అనంతరం డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. ఆ కారు సిగ్నల్‌ వద్ద వేచి ఉన్న ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఐదుగురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)