ఇజ్రాయెల్‌ సైన్యం డేరింగ్‌ ఆపరేషన్‌ !

Telugu Lo Computer
0

జ్రాయెల్‌, హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల భూభాగాలు దద్దరిల్లుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ సైన్యం డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ 250 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. వారిని గాజా సరిహద్దుల్లో బంధించినట్లు తెలుసుకున్న ఐడీఎఫ్ ఆ ప్రాంతంలో డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మిలిటెంట్లకు ఎదురెళ్లి వారి చెరలో ఉన్న వారందరినీ సురక్షితంగా విడిపించింది. ఈ దాడిలో సుమారు 60 మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్‌ మట్టుపెట్టింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)