క్రికెట్‌కి ఒలింపిక్స్‌లో చోటు !

Telugu Lo Computer
0


2028 లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి క్రికెట్ ను కూడా చేర్చడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ముంబైలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలోని రెండో రోజు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్‌, స్వ్కాష్, లాక్రోస్‌తో పాటు కొత్తగా చేర్చిన మరో 5 క్రీడల్లో క్రికెట్ కూడా ఉందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. క్రికెట్‌ని కూడా చేర్చాలనే లాస్ ఏంజెల్స్‌ నిర్వాహకులు ప్రతిపాదనను ఐఓసీ ఆమోదించిందని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)