శ్రీలంకలో 37 మంది తమిళ జాలర్ల అరెస్ట్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 29 October 2023

శ్రీలంకలో 37 మంది తమిళ జాలర్ల అరెస్ట్ !


శ్రీలంక నావికా దళం అదుపు లోకి తీసుకున్న 37 మంది మత్సకార్మికులను, వారి పడవలను విడుదల చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదివారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి శ్రీలంక నేవీ ఈ అరెస్టులు చేసింది. తమిళనాడు మత్సకారులు కేవలం చేపలవేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారన్న సంగతి మీకు తెలిసిందేనని, ఈ విధంగా తరచుగా అరెస్టులు చేయడం మత్సకార సమాజానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని స్టాలిన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన లేఖ మీడియాకు విడుదల చేశారు. పాక్ జలసంధిలో భారత మత్సకారుల సంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. మత్య కారుల అరెస్ట్‌లు ఆపాలని , పడవలను పట్టివేయకూడదన్న డిమాండ్లు చేస్తున్నప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఈ చర్యలను కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో ప్రవేశించారనే కారణంగా 37 మంది మత్సకార్మికులను, ఐదు పడవలను శ్రీలంక నేవీ అదుపు లోకి తీసుకున్నట్టు ఫిషరీస్ అధికారి ధ్రువీకరించారు.

No comments:

Post a Comment