ఇండో-చైనా సరిహద్దులో 13 వేల అడుగుల ఎత్తులో అతి పొడవైన టన్నెల్ నిర్మాణం

Telugu Lo Computer
0


రుణాచల్ ప్రదేశ్ లో 13,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపొడవైన బై-లైన్ సెలా టన్నెల్ మార్గాన్ని పూర్తి చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ 2019లో సెలా టన్నెల్ కి శంకుస్థాపన చేశారు. ఇండో-చైనా బోర్డర్ లోని తూర్పు సెక్టార్ వైపు మెరుగైన కనెక్టివిటీ కోసం అరుణాచల్ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా భారత్ ఈ సెలా సొరంగాన్ని నిర్మిస్తోంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తున్న ఈ టన్నెల్‌ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించబడుతోంది. ప్రస్తుతం సెలా టన్నెల్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలోగా టన్నెల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ సొరంగ తవాంగ్ ప్రజలకు అన్ని వాతావరణ పరిస్థితుల్లో మంచి రవాణా సౌకర్యాలను అందిస్తుందని. జిల్లాను సందర్శించే పర్యాటకులతో పాటు సాయుధ దళాలకు ఈ టన్నెల్ చాలా కీలకం. ఈ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. సెలా టన్నెల్ ప్రాజెక్టు రెండు సొరంగాలను కలిగి ఉంది. టన్నెల్-1 పొడవు 980 మీటర్లు కలిగిన సింగిల్ ట్యూబ్ టన్నెల్ కాగా.. టన్నెల్-2, 1555 మీటర్ల పొడవైన ట్విన్ ట్యూబ్ టన్నెల్. సెలా టన్నెల్ సెలా పాస్ నుంచి 400 మీటర్ల దిగువన ఉంది. శీతాకాలంలో విపరీతమైన మంచు కురిసే సందర్భాల్లో కూడా ఈ టన్నెల్ గుండా ప్రయాణాలు కొనసాగించవచ్చు. సెలా టన్నెల్‌కు 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు, దీని నిర్మాణం ఏప్రిల్ 1, 2019న ప్రారంభమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)