మెట్రోలో తిన్న ప్రయాణికుడికి రూ.500 జరిమానా !

Telugu Lo Computer
0


బెంగుళూరు మెట్రోలో ఓ వ్యక్తి మెట్రోలో కూర్చొని దర్జాగా మంచూరియా తిన్నాడు. అందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు.. మెట్రోలో పరిశుభ్రతకు భంగం కలుగకుండా తిను బండారాలను రైళ్లో తినడానికి వీలు లేదని అధికారులు ఎప్పుడో ప్రకటించారు. కానీ అది లెక్క చెయ్యకుండా ఓ వ్యక్తి మంచూరియ తినడం విచిత్రం. గోబీ మంచూరియా తింటూ వీడియోకు పోజులిచ్చాడు.  ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి మెట్రో యాజమాన్యం దృష్టికెళ్లింది. దీంతో సదరు ప్రయాణీకుడికి మెట్రో యాజమాన్యం షాకిచ్చింది. రూ.500 జరిమానా విధించింది. అంతేకాదు కేసు కూడా నమోదు చేసింది. బెంగుళూరు మెట్రో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. దీంట్లో నగర మెట్రో నిబంధనల ప్రకారం రైళ్లలో ఆహారం తినటం, ప్లాట్‌ఫారమ్‌లపై భోజనం చేయడం నిషేధం. ఈ నిబంధనలు అతిక్రమించటంలో యాజమాన్యం పోలీసులకు సదరు ప్రయాణీకుడిపై ఫిర్యాదు చేసింది. తన స్నేహితులతో కలిసి మెట్రోలో ఆఫీస్ కు బయల్దేరాడు. ఈక్రమంలో మెట్రోలో మంచూరియా తిన్నాడు. అదంతా అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోలో అతనికి స్నేహితులు హెచ్చరించారు. ”అన్ ఎడ్యూకేటడ్ ఫెలో.. మెట్రోలో జర్నీ చేస్తూ తింటున్నాడు’ అంటూ వ్యాఖ్యానించటం స్పష్టంగా వినిపించింది. అదే అతనికి ఫైన్ పడేలా చేసింది.. మొత్తానికి ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)