రూపాల్ ఓగ్రే హత్య కేసులో అరెస్టయిన నిందితుడు ఆత్మహత్య !

Telugu Lo Computer
0


యిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రేను హత్య చేసిన కేసులో ఆరెస్టైన నిందితుడు విక్రమ్ అత్వాల్ ఈ రోజు అంధేరీ పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి అత్వాల్ తన ప్యాంట్‌ను ఉపయోగించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి పంపించారు. రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అత్వాల్ క్లీనింగ్ పనులు చేస్తుంటాడు. అయితే తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు. ముందుగా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే విషయం ఎక్కడ బయటపడుతుందో అని విక్రమ్ అట్వాల్ ఆమె మెడను పదునైన ఆయుధంతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)