కొనసాగుతున్న ఆందోళనలు

Telugu Lo Computer
0


ణిపూర్‌లో విద్యార్థుల హత్యకు నిరసనగా రెండవ రోజైన బుధవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల అదృశ్యం, హత్యకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడుతున్నట్లు విద్యార్థి నేత తోక్‌చోమ్‌ ఖగెంద్ర సింగ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని కోరామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ర్యాలీ చేపట్టారు. నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. తమపై వివక్షను వ్యతిరేకిస్తూ కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళా విభాగం ఇండెగ్నియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ (ఐటిఎల్‌ఎఫ్‌) చురాచంద్‌పూర్‌ జిల్లాలో నిరసన ప్రదర్శన చేపట్టింది. మణిపూర్‌లో సుమారు ఐదు నెలల పాటు సాగిన హింసాకాండలో కుకీ మహిళలపై జరిగిన హత్యలు, అత్యాచారాలపై ఎందుకు విచారణ ప్రారంభించలేదని ఐటిఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ మేరీ జోన్‌ ప్రశ్నించారు. మొయితీకి చెందిన ఇద్దరు విద్యార్థుల హత్యపై సిబిఐ సత్వర చర్యలు చేపట్టినపుడు.. పలువురు గిరిజన మహిళలపై అత్యాచారం, హత్య జరిగిన కేసుల్లో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తమ మహిళలను నగంగా ఊరేగించడంతో పాటు పలువురిని హత్య చేసిన ఘటనలపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. తమపై ఎందుకింత వివక్ష అని ప్రభుత్వాన్ని నిలదీసింది. గిరిజనుల హింసాకాండ ఘటనలపై కూడా సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లంకా పబ్లిక్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ ర్యాలీ తిపైముఖ రోడ్‌, ఐబి రోడ్‌ మీదుగా హింసాకాండలో మరణించిన వ్యక్తుల డమ్మీ శవపేటికలు ఉంచిన వాల్‌ ఆఫ్‌ రిమెంబరెన్స్‌ వరకు సాగింది. దీంతో ఇంఫాల్‌ లోయతో పాటు పలు ప్రాంతాల్లో ప్రభుత్వం పోలీసులతో పాటు కేంద్ర బలగాలైన సిఆర్‌పిఎఫ్‌, ఆర్‌ఎఎఫ్‌లను మోహరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)