ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో అల్లర్లను తగ్గుముఖం పట్టించేందుకు ఒకపక్క తాము అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క ఎడిటర్స్ గిల్డ్ ఇండియా మీడియా సంస్థ అగ్గికి ఆజ్యం పోసిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదనంగా ఎన్.శరత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త కూడా ఈజీఐ పై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. మణిపూర్‌లో కుకీ, మెయిటీ తెగల మధ్య జరిగిన అల్లర్లు చిలికి చిలికి గాలివానై తర్వాతి దశలో పెను ప్రళయంగా మారి దారుణ మారణకాండకు దారితీశాయి. అల్లర్ల సమయంలో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సింది పోయి తప్పుడు కథనాలను ప్రచురించి అల్లర్లకు మరింత చెలరేగడానికి కారణమయ్యారని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై మణిపూర్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శనివారం ప్రచురించిన కథనం ప్రకారం మణిపూర్ ప్రభుత్వం అల్లర్ల సమయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు స్పష్టమయ్యిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలా ప్రజలపట్ల సమానంగా వ్యవహరించకుండా ఒక పక్షంవైపే నిలిచిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు అసత్యమైనవని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)