డెత్ బెనిఫిట్: ఒకవేళ అనుకోని ఘటనలో పాలసీ దారుడి మరణం సంభవిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక రక్షణను ఈ పథకం అందిస్తుంది.
సరెండర్ బెనిఫిట్: కొన్ని షరతులలో పాలసీని సరెండర్ చేయడానికి ఇది అనుమతి ఇస్తుంది.
లాయల్టీ జోడింపులు: మీ పొదుపులను మెరుగుపరచడానికి లాయల్టీ జోడింపులను కూడా ఇది అందిస్తుంది.
పాలసీ లోన్: మీ పాలసీ విలువ ఆధారంగా రుణ సౌకర్యాన్ని యాక్సెస్ చేయొచ్చు.
పన్ను ప్రయోజనాలు: ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
ప్రీమియం చెల్లింపులు: మీ సౌలభ్యం ప్రకారం ప్రీమియం చెల్లింపులు చేయొచ్చు.
ఈ పాలసీ 8 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలందరికీ అందుబాటులో ఉంటుంది. పాలసీ 10 నుంచి 20 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో మెచ్యూర్ అవుతుంది, గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు. ఉదాహరణకు, మీరు 15 ఏళ్ల వయస్సు నుంచి 25 ఏళ్ల వరకు రోజుకు రూ. 87 పెట్టుబడి పెడితే, రూ. 31,755 జమ కావడానికి సంవత్సరం పడుతుంది. మరో పదేళ్లపాటు స్థిరంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా, మీరు రూ. 3,17,550 డిపాజిట్ చేసినట్లు అవుతుంది. మీకు 70 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తం మెచ్యూర్ అవుతుంది. ఇది మీకు సుమారు రూ. 11 లక్షలను అందిస్తుంది.
No comments:
Post a Comment