కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేయబోం !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో  కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మాట్లాడుతూ కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయబోదని తెలిపారు. అక్టోబర్ 2023 నుంచి 6 ఎయిర్‌బ్యాగుల్ని తప్పనిసరి చేసే భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని గతేడాది ప్రభుత్వం ప్రతిపాదించింది. గతేడాది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, కార్లలో ప్రయాణిస్తున్న ప్రయణికులు భద్రతనున పెంచడానికి సెంట్రల్ మోటార్స్ వెహికిల్ రూల్స్ -1989ను సవరించడం ద్వారా భద్రతను మరింతగా మెరుగుపరచాలని నిర్ణయించింది. అంతకుముందు ఏప్రిల్1, 2021 తర్వాత తయారుచేయబడిని వాహనాల్లో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగుల్ని తప్పనిసరి చేసింది. ఎయిర్‌బ్యాగుల వల్ల కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోగలరు. ప్రస్తుతం ప్రీమియం కార్లే కాకుండా.. రూ.20 లక్షల లోపు కార్లలో కూడా పలు కంపెనీలు 6 ఎయిర్‌బ్యాగులను అందిస్తున్నాయి. ప్రజలు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కార్ల కంపెనీలు కూడా తగు ప్రమాణాలను పాటిస్తున్నాయి. బిల్ట్ క్వాలిటీ, ఎయిర్ బ్యాగ్స్, ఇతర సాంకేతిక అంశాలను కార్లలో జోడిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)