సనాతన ధర్మంపై విమర్శల తీవ్రతను తగ్గించండి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 September 2023

సనాతన ధర్మంపై విమర్శల తీవ్రతను తగ్గించండి !


నాతన ధర్మంపై తమ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించుకోవాలని డిఎంకె నాయకులను, తమిళనాడులోని మిత్రపక్షాలను తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ బుధవారం కోరారు. సనాతన ధర్మంపై ఏర్పడిన వివాదాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన అవినీతిని, అక్రమాలను కప్పిపుచుకోవడానికి వాడుకుంటోందని స్టాలిన్ ఆరోపించారు. సనాతన ధర్మంపై తమిళనాడులోని నాయకులు చేస్తున్న విమర్శలు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, టిఎంసి, శివసేనను ఆత్మరక్షణలోని నెట్టివేస్తున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో స్టాలిన్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. డిఎంకెతోపాటు ఇండియా కూటమిలోని ఈ పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలు బిజెపి ముద్రవేస్తోంది. ససనాతన ధర్మం చర్చనీయాంశం కావాలన్న ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులు ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజు దీనిపై మాట్లాడుతున్నారని, దేశాన్ని పట్టిపీడిస్తున్న అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే వారు ఈ పనిచేస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. సనాతన ధర్మ అంశాన్ని రెచ్చగొట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బిజెపి పన్నిన వ్యూహానికి అవకాశం ఇవ్వకూడదని ఆయన తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బిజెపి ప్రభుత్వం నియంతృత్వ పాలనను దేశంలో స్థాపించాలన్న లక్షంతో విద్వేష రాజకీయాలను ప్రోత్సహించి దేశాన్ని ప్రమాదకర మార్గంలోకి నెట్టివేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. బిజెపి చెబుతున్న అబద్ధాలను ప్రజల ముందు బట్టబయలు చేయాలని, తమ ప్రచారానికి అదే కేంద్ర బిందువు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడమే ఏకైక లక్షంగా తాము కలసికట్టుగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

No comments:

Post a Comment