మా పిల్లల అస్థికలైనా తెచ్చివ్వండి, అంత్యక్రియలు జరుపుకుంటాం !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జులైలో కన్పించకుండా పోయిన ఓ అమ్మాయి, అబ్బాయి మృతదేహాల ఫోటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే ఇప్పటివరకు వారి మృతదేహాలను మాత్రం గుర్తించలేక పోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లల అవశేషాలైనా గుర్తించి అప్పగిస్తే తాము అంత్యక్రియలు చేసుకుంటామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మణిపూర్‌లో ఇటీవల ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ మృతదేహాల ఫోటోలు బయటికొచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ వారి మృతదేహాలు ఎక్కడున్నాయన్నది మాత్రం ఇంకా గుర్తించలేదు. "మా పిల్లలను చివరిసారి చూడాలనుకుంటున్నాం. సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతున్నాం. మా పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలంటే కనీసం వారు చివరిసారి ధరించిన చిన్నదుస్తుల ముక్క అయినా ఉండాలి. సీబీఐ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది. వారి అస్థికలు వెతికి ఇచ్చినా మా పిల్లలకు తుది వీడ్కోలు పలుకుతాం" అని మృతుల తల్లిదండ్రులు వాపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)