బ్యాండేజ్‌తో కనిపించిన న్యాయవాది - ఆరా తీసిన సీజేఐ !

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టులో సోమవారం ఓ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సమయంలో ఆయన బ్యాండేజ్‌ వేసుకొని ఉండటం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ దృష్టిలోపడింది. దాంతో వెంటనే ఏమైందంటూ న్యాయవాదిని ప్రశ్నించగా, వీధి కుక్కల దాడిలో గాయపడినట్లు ఆయన చెప్పారు. తన ఇంటి దగ్గర్లోనే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. దాంతో అవసరమైతే వెంటనే ఆయనకు వైద్య సహాయం అందించాలని ప్రధాన న్యాయమూర్తి సిబ్బందికి సూచించారు. గతంలో తన సిబ్బంది ఎదుర్కొన్న దాడి గురించి గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో సీనియర్ లాయర్ విజయ్ హన్సారియా మాట్లాడుతూ.. వీధికుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సీజేఐ సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుక్కకాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్‌ బారినపడటంతో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వ్యాధి తీవ్రం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. తండ్రి చేతుల్లోనే ఆ పిల్లాడు మృతి చెందాడు. ఇదే విషయాన్ని సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా ఈ సందర్భంగా కోర్టులో ప్రస్తావించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)