కొత్తకారుకి పూజలు చేసిన దక్షిణ కొరియా అంబాసిడర్‌ !

Telugu Lo Computer
0


క్షిణ కొరియా రాయబార కార్యాలయంలో అంబాసిడర్ చాంగ్ జే-బోక్ కోసం కొత్త కారు కొనుగోలు చేసారు. దీనికి ప్రత్యేక పూజలు చేసారు. ఎంబసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసారు. 'అంబాసిడర్ అధికారిక వాహనంగా కొత్త హ్యుందాయ్ జెనెసిస్ GV80 ని కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము. మంచి జరగాలని పూజ నిర్వహించాము. మా రాయబార కార్యాలయం కొత్త ప్రయాణంలో చేరండి' అనే శీర్షికతో భారతదేశంలోని కొరియన్ ఎంబసీ వీడియోను షేర్ చేసింది. కొత్త కారు పూజాకార్యక్రమంలో చాంగ్ జే-బోక్ తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. 'ఈ వీడియో వైరల్ అవుతోంది. మన సంస్కృతిని ఆదరించినందుకు ధన్యవాదాలు.. కొత్త వాహనంతో శుభాకాంక్షలు' అంటూ అందరూ నెటిజన్లు విష్ చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)