ఖాకీ రంగు ధరించే వ్యక్తులపై దాడి చేసేలా కుక్కలకు ట్రైనింగ్ !

Telugu Lo Computer
0


కేరళలో కుక్కల పెంపకం దారుడు ఖాకీ రంగు ధరించే వ్యక్తులపై దాడి చేసేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఖాకీ రంగు ధరించేది పోలీసులే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. కేరళ పోలీసులు కొట్టాయం జిల్లాలోని కుక్కల పెంపకం కేంద్రంపై దాడి చేసి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం ‘డెల్టా కె9’ పేరుతో ఉన్న ఈ కేంద్రం వాస్తవానికి గంజాయిని విక్రయించడానికి అడ్డాగా మారింది. దాడి సమయంలో అక్కడ కుక్కల సంరక్షణ చూసే రాబిన్ జార్జ్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు. పెంపుడు జంతువుల కేంద్రం నెపంతో అక్కడ రాబిన్ జార్జ్ గంజాయిని విక్రయిస్తూ ఖాకీ రంగు దుస్తులు ధరించిన వ్యక్తులపై దాడి చేసేలా కుక్కలకు శిక్షణ ఇచ్చాడు. పోలీసులు దాడి చేసిన సందర్భంలో కుక్కలను అదుపులోకి తీసుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఈ కేంద్రంలో పిట్‌బుల్స్, రోట్ వీలర్స్‌తో సహా 15 కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. రాబిన్ ఈ కేంద్రాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)