భారత్‌ తో బంధాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నాం !

Telugu Lo Computer
0


లిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌పై అసాధారణ ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన స్వరం మార్చారు. భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరుచుకునేందుకు కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు గురువారం మాంట్రియల్‌లో మీడియాతో ట్రూడో మాట్లాడారు. 'భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయాల పరంగా ముఖ్యమైన దేశం. భారత్‌తో దృఢమైన బంధాన్ని పెంపొందించుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మేం గతేడాదే మా ఇండో-పసిఫిక్‌ వ్యూహంతో ముందుకొచ్చాం. భారత్‌తో చట్టబద్ధ పాలనకు చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని ట్రూడో ప్రకటించారు. ఈ విషయంలో కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్‌ హత్య విషయంలో వాస్తవాలను వెలికి తీసేందుకు మాతో కలిసి భారత్‌ పనిచేయాల్సిన అవసరం ఉందని ట్రూడో వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)