దెయ్యాలు నిర్మించిన శివాలయం ?

Telugu Lo Computer
0


ర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబళాపురం దేవనహళ్లి మార్గంలోని బొమ్మావర గ్రామంలో ఉన్న సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు కట్టించాయని చాలామంది భావిస్తుంటారు. సాధారణంగా గుడి మీద దేవుళ్లు, దేవతల ప్రతిమలు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవాలయంలో రాక్షసులు, దెయ్యాల విగ్రహాలు ఉంటాయి. 600 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం ఉందని భోగట్టా. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో నివశించే ప్రజలను దెయ్యాలు ఎంతగానో భయపెట్టేవట. అక్కడి ప్రజలు మాంత్రికుని సూచన మేరకు శివాలయాన్ని నిర్మించడం చేశారు. అప్పుడు గుడిని దెయ్యాలు తోసివేస్తే, ఆ మాంత్రికుడు వాటిని వశపరుచుకొని ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పటినుంచి ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించిన ఆలయం అని పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)