ఏ, బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువట !

Telugu Lo Computer
0


మధ్య కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డే ని జరుపుకుంటారు. గుండె సంబంధిత వ్యాధులు జీవనశైలిపై లేదా జన్యుశాస్త్రంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు బ్లడ్ గ్రూప్ కూడా కారణం కావచ్చు. బ్లడ్ గ్రూప్ కారణంగా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. బ్లడ్ గ్రూప్, గుండె సంబంధిత వ్యాధులపై నిర్వహించిన పరిశోధనలో కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ద్వారా తెలుస్తోంది. పరిశోధన ప్రకారం ఏ, బి బ్లడ్ గ్రూప్‌ల వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఉన్నవారిలో రక్తం గడ్డకట్టే గుణం ఎక్కువ ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. ఇంకా చెప్పాలంటే ఇతర బ్లడ్ గ్రూప్ ల వారి కంటే ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధలు కూడా చెబుతున్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు ఇందుకు సంబంధించి దాదాపు 4 లక్షల మందిపై పరిశోధనలు జరిపినట్లు.. ఈ పరిశోధనల్లో ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. అంతేకాదు ఈ బ్లడ్ గ్రూప్ వారికి గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. హార్ట్ఎ టాక్ , హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం మిగతా బ్లడ్ గ్రూప్ కంటే 10 శాతం తక్కువ అని పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)