తల్లిని చంపిన తనయుడు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 9 September 2023

తల్లిని చంపిన తనయుడు !


ఢిల్లీలో మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు తన తల్లిని అత్యంత దారుణంగా చంపాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు త్రిలోక్‌పురి ఏరియాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలని రాజ్‌కుమారి (60)గా గుర్తించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. నిందితుడిని సూరజ్‌గా గుర్తించామని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పొరుగింటి వ్యక్తి నీరజ్ పటేల్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment