యాసిడ్‌ ట్యాంకర్‌ బోల్తా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 9 September 2023

యాసిడ్‌ ట్యాంకర్‌ బోల్తా !


హారాష్ట్రలోని థానేలో యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి డ్రైనేజ్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో అందులోని సల్ఫ్యూరిక్ యాసిడ్‌ ఆ మురికి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఆ ట్యాంకర్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎనిమిది టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో వెళుతున్న ట్యాంకర్ శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముంబ్రా బైపాస్‌ వద్ద నియంత్రణ కోల్పోయింది. రోడ్డు నుంచి జారి పక్కన ఉన్న మురికి కాలువ గట్టుపై బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ట్యాంకర్‌లోని సల్ఫ్యూరిక్ యాసిడ్‌ ఆ డ్రైనేజీలో కలిసింది. దీంతో ఆ ప్రాంతమంతా ఘాటు వాసనలు వెదజల్లాయి. ఈ ప్రమాదం సంగతి తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ట్యాంకర్‌ డ్రైవర్‌ బ్రిజేష్ సరోల్‌ను ఆసుపత్రికి తరలించారు. అలాగే ఘాటు వాసనలు రావడంతో రెస్కూ సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన చోటు నివాసిత ప్రాంతం కాకపోవడంతో ఎవరికీ ఏమీ కాలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

No comments:

Post a Comment