బాలుడి ప్రాణాలు కాపాడిన వృద్ధుల సమయస్ఫూర్తి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ లోని  వారణాసి, చేత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జితేంద్ర నివాసం ఉంటున్నాడు. మంగళవారం వారు ఉంటున్న వీధిలో భారీ వర్షం కురిసింది. కాస్త తెరిపివ్వగానే జితేంద్ర కుమారుడు కార్తీక్‌ ఆడుకోవడానికి బయటకు వచ్చాడు. ఆ క్రమంలో విద్యుత్‌ ప్రసరిస్తున్న స్తంభానికి సమీపంగా వెళ్లి ఒక్కసారిగా రోడ్డుపై నిలిచిన నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న ముగ్గురు వృద్ధులు బాలుడు పడిపోయిన విషయాన్ని గమనించారు. అందులో ఒకరు పరుగున వెళ్లి చిన్నారి పైకి లేపేందుకు యత్నించారు. అయితే, విద్యుత్‌ షాక్‌ ప్రసరిస్తున్నట్లు గ్రహించి వెనక్కి తగ్గారు. విషయం తెలిసి మిగిలిన ఇద్దరు వృద్ధులు వెంటనే ఓ కర్ర సేకరించి తీసుకొచ్చారు. అందులో ఒకరు దాన్ని నెమ్మదిగా బాలుడి చేతికి అందించారు. చిన్నారి దాన్ని పట్టుకోగానే అతడిని బురద నీటిలో నుంచి పక్కకు లాగారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. ఆ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. వృద్ధుల సమయ స్ఫూర్తిని పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)