వరుడి చెంప చెల్లుమనిపించిన వధువు !

Telugu Lo Computer
0


పెళ్లి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో కళ్యాణ మండపానికి సంబంధించినది. పెళ్లికూతురు వరుడికి తగిన గుణపాఠం నేర్పించింది. వైరల్‌ అవుతున్న వీడియోలో వరుడు గుట్కా తింటూ పెళ్లి మండపానికి రావటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ కారణంగా వధువు కోపంగా, అందరి ముందు వరుడి చెంప చెల్లుమనిపించింది. పెళ్లి మండపంలో కూర్చున్న వధూవరులకు ఎదురుగా ఉన్న వ్యక్తి పెళ్లి కూతురికి ఏదో చెబుతున్నాడు.. దాంతో చిరాకుపడ్డ ఆమె, అతని ముఖంపై ఒక్కటిస్తుంది. ఆ తర్వాత వరుడివైపుకు తిరిగింది. అతడు గుట్కా తింటున్నాడని తెలిసి ఎడమ చేత్తో ఈడ్చి కొట్టింది. దాంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. అందరి ముందే ఆమె ఆ ఇద్దరి చెంపలు చెల్లుమనిపించిన ఈ ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)