లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఆస్తి పత్రాలను సకాలంలో తిరిగి అందజేయాలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 September 2023

లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఆస్తి పత్రాలను సకాలంలో తిరిగి అందజేయాలి !


ప్రాపర్టీ లోన్స్ విషయంలో వినియోగదారులకు అనుకూలంగా ఆర్‌బిఐ  కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఆస్తి పత్రాలను సకాలంలో తిరిగి అందించకుంటే కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాలని రిజర్వు బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులను నేడు జారీ చేసింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు సైతం ఆర్డర్స్ పంపింది. రుణ చెల్లింపులు పూర్తయ్యాక డాక్యుమెంట్లను ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు తిరిగి అందించటంలో జాప్యం చేస్తున్నాయని ఎక్కువగా ఫిర్యాదులను అందుకోవటంతో రిజర్వు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ కోడ్ ఆఫ్ ఫెయిర్ ప్రాక్టీస్ ప్రకారం కస్టమర్ ప్రాపర్టీ లోన్ వాయిదాలు పూర్తి చెల్లింపు తర్వాత వెంటనే ఆస్తి పత్రాలను పొందాలి. ఇకపై రుణ సంస్థలు లోన్ సెటిల్మెంట్ తర్వాత 30 రోజుల్లోపు కస్టమర్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి అందించాల్సి ఉంటుంది. కస్టమర్లు తమ సౌకర్యం ప్రకారం బ్రాంచ్ నుంచి పత్రాలను పొందవచ్చు. లోన్ మంజూరు సమయంలో బ్యాంకులు ఇచ్చే లేఖలో డాక్యుమెంట్ పత్రాలను ఎప్పుడు తిరిగి అందిస్తారనే తేదీని, డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకోవాల్సిన స్థలాన్ని బ్యాంకులు ముందుగానే సూచించాలని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. రుణ గ్రహీత మరిణించినప్పుడు చట్టపరమైన వారసులకు వాటిని తిరిగి ఇచ్చే విధానాన్ని నిర్ణయించాలని తెలిపింది. అలాగే ప్రాపర్టీ లోన్ పూర్తిగా చెల్లించిన 30 రోజుల్లోపు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను 30 రోజుల్లోగా తిరిగి అందించటంలో బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ విఫలమైతే కస్టమర్లకు లేటు చేసిన ప్రతి రోజుకూ రూ.5,000 పరిహారంగా చెల్లించాల్సించాలని రిజర్వు బ్యాంక్ తన తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది.

No comments:

Post a Comment