అత్యంత ఖరీదైన పండు యుబారి కింగ్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 September 2023

అత్యంత ఖరీదైన పండు యుబారి కింగ్ !


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు యుబారి కింగ్. ఇది పుచ్చకాయలలో ఒక రకం. దీని ధర వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది. దీనిని జపాన్‌లో మాత్రమే సాగు చేస్తారు. యుబారి పుచ్చకాయను జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో ఉన్న యుబారి నగరంలో మాత్రమే పండిస్తారు. అందుకే దీనికి యుబారి మెలోన్ అని పేరు పెట్టారు. యుబారి నగరంలోని ఉష్ణోగ్రత ఈ పండుకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యుబారి నగరంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే యుబారి పండు తియ్యగా, రుచిగా ఉంటుందని చెబుతారు. యుబారి కింగ్ అతిపెద్ద విశేషం ఏంటంటే అది మార్కెట్లో విక్రయించబడదు. ఇది కావాలంటే వేలంలోనే దక్కించుకోవాలి. 2022 సంవత్సరంలో ఒక యుబారి పండు 20 లక్షల రూపాయలకు వేలం వేయబడింది. కాగా 2021లో ఈ పండు రూ.18 లక్షలకు విక్రయించబడింది.  యుబారి కింగ్ ఒక యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియంతో పాటు విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం కూడా ఇందులో ఉన్నాయి. 

No comments:

Post a Comment