మహీంద్రా దారిలో మరికొన్ని కంపెనీలు ?

Telugu Lo Computer
0


లిస్తాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దౌత్యపరంగా ఇబ్బందులు ఎదుర‍్కొంటున్న కెనడాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కెనడా తీరును తప్పుబడుతూ కెనడాలో భారత్‌కు చెందిన కంపెనీలు తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కెనడాలో తన అనుబంధ సంస్థ రెస్సన్‌ ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మహీంద్రా దారిలో భారత్‌లోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్‌ ఉక్కు తయారీ సంస్థగా పేరొందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌ సంస్థ కెనడాకు చెందిన ఉక్కు కంపెనీతో కొనసాగిస్తున్న వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్కు తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కెనడాకు చెందిన మైనింగ్‌ కంపెనీ టెస్క్‌ రిసోర్సెస్‌ కు చెందిన స్టీల్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఎల్క్‌ వ్యాలీ రిసోర్సెస్‌ లిమిటెడ్‌లో 20 శాతం నుంచి 40 శాతం వాటాను కొనుగోలు చేయాలని గత నెలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భావించారు. ఆ కొనుగోలు విలువ సుమారు 8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ క్రమంలో కెనడా తీరును తప్పుబడుతూ టెస్క్‌ కంపెనీలోని వాటాను కొనుగోలు చేసే అంశంపై జేఎస్‌డబ్ల్యూ వెనక్కి తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేశాయి. దీంతో కెనడాకు వాణిజ్య పరంగా మరింత ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కెనడాలో మొత్తం విదేశీయులు 3,21,00,340 మంది ఉన్నారు. వారిలో భారతీయ పౌరులు 5.26 శాతం మంది నివసిస్తున్నారు. పైగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ భాగం అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులపై ఆధారపడి ఉంది. పలు నివేదికల ప్రకారం.. ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ విద్యార్థులు భారీ ఎత్తున ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు. ఆ ఫీజుల రూపంలో కెనడియన్ ఆర్థిక వ్యవస్థకు 30 బిలియన్లు అందిస్తున్నారు. ఇందులో భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజుల వాటా ఎక్కువగా ఉంది. అందువల్ల, భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్లడం మానేస్తే కెనడా మరో రూపంలో ఇబ్బందులు పడనుంది. కెనడాలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ టెక్‌ కంపెనీలతో మొత్తం 30 సంస్థలు కెనడాలో బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీల వల్ల కెనడాలోని పౌరులకు ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బ తినే అవకాశం ఉందని ఆయా పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)