జేడీఎస్ కు సయ్యద్ సైఫుల్లా రాజీనామా

Telugu Lo Computer
0


ర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరింది. రెండు రోజుల క్రితం జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అతని కుమారుడు నిఖిల్ గౌడ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు చిగురించింది. రెండు పార్టీలు కలిసికట్టుగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇదిలా ఉంటే జేడీఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఆ పార్టీలోని కొందరు ముస్లిం నాయకులు అయిష్టంగా ఉన్నారు. తాజాగా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. పార్టీ సీనియర్ నేత, కర్ణాటకలో జేడీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ షైఫుల్లా ఆ పార్టీకి రాజీనామా చేశారు. మతాలు, కులాల మధ్య చీలిక తీసుకువచ్చే పార్టీలో జేడీఎస్ చేరిందని, గత 30 ఏళ్లుగా జేడీఎస్ లో ఉన్నానని, మా పార్టీ ఓటర్లకు, సామాన్య ప్రజలకు సెక్యులర్ సిద్ధాంతాలను ప్రచారం చేసిందని, ఇప్పుడు బీజేపీతో చేరుతుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు. మనం దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన మార్గం ఇది కాదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీతో లౌకిక శక్తులు ఏకీభవించడం లేదని షైఫుల్లా అన్నారు. ఇక పార్టీలో సర్దుపోవడం తనకు కష్టమని అందుకే రాజనీమా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ద్వేషాన్ని ప్రచారం చేసే వారితో సర్దుకుపోవడం కష్టమని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)