కపూల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు !

Telugu Lo Computer
0


ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కపూల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. బ్యాంక్ వల్ల సరిపడినంత మూలధనం లేకపోవడం, అలాగే ఆదాయ అంచనాలు లేకపోవడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ కావడం వల్ల ఇకపై ఆ బ్యాంక్ ఉండదు. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపథ్యంలో ఇకపై ఆ బ్యాంక్ డిపాజిట్లు స్వీకరించడం, డిపాజిట్లు చెల్లించడం వంటివి చేయకూడదు. ఈ క్రమంలో బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. డిపాజిట్ దారులకు రూ.5 లక్షల వరకు లభిస్తాయి. అంటే రూ. 5 లక్షల వరకు డిపాజిట్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పూర్తిగా డబ్బులు వెనక్కి వస్తాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద ఈ బెనిఫిట్ వస్తుంది. అయితే రూ. 5 లక్షలకు పైగా డబ్బులు పెట్టిన వారికి మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వీరికి రూ. 5 లక్షల వరకే వస్తాయి. వడ్డీ, అసలు రెండూ కలిసి రూ. 5 లక్షల వరకే లభిస్తాయి. అంటే ఇలాంటి వారికి నష్టం కలుగుతుంది. బ్యాంక్ కార్యకలాపాలను ఇంకా కొనసాగిస్తే.. బ్యాంక్ ఖాతాదారులపై మరింత ప్రతికూల ప్రభావం పడొచ్చని, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే బ్యాంక్ తన డిపాజిట్ దారులకు పూర్తిగా డబ్బులు చెల్లించే స్థితిలో కూడా లేదని ఆర్‌బీ తెలిపింది. కాగా 2023 జూలై 24 నాటికి చూస్తే.. డీఐసీజీసీ ఏకంగా రూ. 230 కోట్లు చెల్లించింది. ఇన్సూరెన్స్ డిపాజిట్ స్కీమ్ కింద బ్యాంక్ కస్టమర్లకు ఈ మేరకు డబ్బులు అందించింది. ఆర్‌బీఐ గతంలో కూడా పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)