ప్రత్యర్థులను గురువులుగా భావిస్తా !

Telugu Lo Computer
0


తన ప్రత్యర్థులను కూడా గురువులుగానే భావిస్తానని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని, సరైన మార్గంలో నడిచేలా తీర్చిదిద్దుతారని అన్నారు. గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ప్రత్యర్థులు వారి ప్రవర్తన, చెప్పే అబద్ధపు మాటల ద్వారా తాను నడిచే మార్గం సరైనదేనని నేర్పిస్తారని అన్నారు. సమాజంలో ప్రజలందరి పట్ల సమానత్వం, ప్రతి ఒక్కరి పట్ల కరుణ, ప్రేమ చూపే జ్ఞానం నేర్పిన మహాత్మాగాంధీ, శ్రీ నారాయణ గురు, గౌతమ్‌ బుద్ధలే తన గురువులని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)