అన్నిమతాలను గౌరవించాలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 September 2023

అన్నిమతాలను గౌరవించాలి !


డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం' పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రజలు అన్నిమతాలను గౌరవించాలని కోరారు. 'నేనూ సనాతన ధర్మానికి చెందిన వాడిని. మనలో చాలా మంది సనాతన ధర్మానికి చెందిన వారే. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలి. దానికి వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడకూడదు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసినప్పటికీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి ఇప్పటికే స్పష్టం చేశారు. తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

No comments:

Post a Comment