ఉదయనిధి స్టాలిన్‌కు ఎంపీ ఏ రాజా మధ్దతు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 September 2023

ఉదయనిధి స్టాలిన్‌కు ఎంపీ ఏ రాజా మధ్దతు !


దయనిధికి మధ్దతుగా ఆ రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సామాజిక రుగ్మతలైన హెచ్‌ఐవీ, కుష్ఠురోగముతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మృదువుగానే ఉన్నాయన్నారు. ''సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన విభిన్నమైనవి కావు. అవి రెండూ ఒకటే. ఉదయనిధి స్టాలిన్ మృదువుగానే సరిపోల్చారు. మలేరియా, డెంగ్యూ మాదిరిగా నిర్మూలించాలన్నారు. నిజానికి ఈ రెండు వ్యాధులు సామాజిక రుగ్మత కాదు. నిజాయితీగా చెప్పాలంటే కుష్ఠురోగం అసహ్యకరంగా అనిపిస్తుంది. హెచ్‌ఐవీ కూడా అంతే. కాబట్టి సనాతన ధర్మాన్ని సామాజికంగా ప్రమాదకరమైన హెచ్ఐవీ, కుష్ఠురోగం మాదిరిగా చూడాలి'' అని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఎంపీ రాజా అన్నారు.ఎవరిని తీసుకొచ్చినా సరే సనాతన ధర్మంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రాజా అన్నారు. 10 లక్షలు లేదా కోటి మంది అయినా నేను లెక్కచేయను. వాళ్లని ఎలాంటి ఆయుధాలనైనా తెచ్చుకోనివ్వండి. నేనూ ఢిల్లీ వస్తా, వచ్చి పెరియార్, అంబేద్కర్ పుస్తకాలతో చర్చ పెడతా'' అని రాజా వ్యాఖ్యానించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశపరిస్తే క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధమయ్యానని బుధవారం కూడా రాజా అన్నారు. సనాతన ధర్మం ఏదో తమరే తేల్చుకోవాలని సవాలు విసిరిన విషయం తెలిసిందే. 

No comments:

Post a Comment