ఒక దేశం, ఒకే సారి ఎన్నికలు విజయసాయిరెడ్డి మద్దతు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 September 2023

ఒక దేశం, ఒకే సారి ఎన్నికలు విజయసాయిరెడ్డి మద్దతు !


ఒక దేశం, ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మద్దతు తెలిపారు. ఈ ప్రతిపాదనలో అనేక సానుకూలతలు ఉన్నాయని, దీని వల్ల వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో విజయసాయి రెడ్డి తన అభిప్రాయాలను ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు. ఒక దేశం, ఒకే సారి ఎన్నికల విధానం భారత్‌కు కొత్తేమీ కాదని, 1951-52, 1957, 1962, 1967లో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఈవిధానం వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు కొత్తగా వచ్చే మార్పేమీ ఉండబోదని, తమ రాష్ట్రంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment