తిరుమలలో మరో చిరుత సంచారం !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతలు, ఇతర అడవి జంతువుల కదలికలను పసిగడుతోంది. శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్‌ చిరుత’ సక్సెస్‌ అయ్యింది. ఇప్పటి వరకు నాలుగు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. ఇంతటితో చిరుతల సంచారం ఆగిపోయినట్టు అంతా సంతోషపడ్డారు.. కానీ, తాజాగా మరో చిరుత ట్రాప్‌ కెమెరాలకు చిక్కిన్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.అలిపిరి నడకమార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాలో మరో చిరుత సంచారం గుర్తించాం.. నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరించింది.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇక, నడకమార్గంలో భక్తులకు 5వ తేదీ నుంచి ఊతకర్రలను అందించే ఏర్పాట్లు చేస్తున్నామని.. అలిపిరి దగ్గర భక్తులకు ఊతకర్రలను అందజేసి.. నరసింహస్వామి ఆలయం వద్ద వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)