కలిపిన గోధుమ పిండిని మర్నాడు వాడకండి !

Telugu Lo Computer
0


ఫ్రిజ్ లోంచి కలిపి ఉంచిన చపాతీ, పూరి పిండి తీసి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పిండి కలిపిన తర్వాత దానిని రెండు గంటల లోపు వాడేయాలి. మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో పెడితే దానిలో అనేక రసాయనిక మార్పులు చోటు చేసుకుని ఆ పిండి మీద బ్యాక్టీరియా, ఫంగస్ డెవలప్ అవుతాయి. ఫ్రిజ్ లోంచి నిల్వ ఉంచిన పిండిని తీయగానే బ్లాక్ కలర్‌లో ఒక పొర కనిపిస్తూ ఉంటుంది. అంటే దానిపై సూక్షక్రిములు డెవలప్ అయ్యాయని గుర్తించాలి. అలాంటి పిండితో చపాతీ, పూరి తింటే కడుపు ఉబ్బరం, విరోచనాలు, కడుపు నొప్పి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. గోధుమ పిండిలో కాల్షియం, ఐరన్, జింకు వంటి పోషకాలు ఉంటాయి. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల వాటిని కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు నిల్వ ఉన్న పిండితో తయారు చేసిన ఆహారం తినడం కారణంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇలాంటి పిండితో ఆహారం తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పిండిని కలిపిన రెండు గంటల్లోపు వాడాలి. కొందరు చపాతీలు సున్నితంగా వస్తాయని వాటిలో పాలు కలుపుతుంటారు. అలా కలిపిన పిండిని మరుసటి రోజుకి నిల్వచేయకూడదు.

Post a Comment

0Comments

Post a Comment (0)