చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 September 2023

చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయి !


ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని సీఐడీ అభియోగాలు చేసింది. చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని తెలిపారు. ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. ఇక నారా లోకేష్‌ సైతం కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇక సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. సీఐడీ తరపున వివేకా చారి, వెంకటేష్‌ న్యాయవాదులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆవరణలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే చంద్రబాబును సీఐడీ అధికారులు శనివారం సాయంత్రం నుంచి విచారణ ప్రారంభించారు. శనివారం సాయంత్రం 5.10 గంటల నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు విచారణ సాగింది. చంద్రబాబును ఏకంగా 10 గంటల పాటు విచారించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు చంద్రబాబు నాయుడు సిట్ కార్యాలయంలో ఉన్నారు.అనంతరం ఉదయం 3 గంటలకు సిట్ కార్యాలయం నుంచి బాబును ఆసుపత్రికి తరలించారు.ఉదయం 3.40 గంటలకు విజయవాడలోని సీజీహెచ్‌కి చంద్రబాబు కాన్వాయ్‌ చేరుకుంది. అనంతరం వైద్యులు 4.20కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక తిరిగి 4.20 గంటలకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. తర్వాత మళ్లీ 4.30 గంటలకు తిరిగి సిట్ కార్యాలయానికి తరిలించారు. ఉదయం 4.45 గంటలకు బాబు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 5.50 గంటలకు సిట్ ఆఫీస్‌ నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఉదయం 5.58 గంటలకు బాబు కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment