అక్టోబర్​ 28న సింగరేణి ఎన్నికలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 September 2023

అక్టోబర్​ 28న సింగరేణి ఎన్నికలు !


సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్​సిగ్నల్​ వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ చీఫ్​ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు సమక్షంలో మేనేజ్​మెంట్, 14 కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు ఫలించాయి. ఇందులో ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను అక్టోబర్​ 28న నిర్వహించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. 22న మరోసారి సమావేశమై, ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​ చేయనున్నారు. ఆ రోజే నామినేషన్లు, గుర్తుల కేటాయింపు, ఓట్లు లెక్కింపు అంశాలపై క్లారిటీ రానుంది. సోమవారం జరిగిన మీటింగ్​లో డిప్యూటీ సీఎల్​సీ డి.శ్రీనివాసులు, సింగరేణి డైరెక్టర్​(ఫైనాన్స్, పా) బలరాంనాయక్​, పర్సనల్​ జీఎం హనుమంతరావు, కార్మిక సంఘాల నుంచి మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య, వి.సీతారామయ్య, ఎస్‌.నర్సింహారెడ్డి, యాదగిరి సత్తయ్య, టి.రాజారెడ్డి, మంద నర్సింహారావు, టి.శ్రీనివాస్‌, త్యాగరాజన్‌, ఐ.కృష్ణ, శ్రీనివాసరెడ్డి, జి.రాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్​వెంటనే ప్రకటించాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ పట్టుబట్టాయి. దీనిని మెజార్టీ సంఘాలు వ్యతిరేకించాయి. 2017, అక్టోబర్​5న చివరిసారి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీబీజీకేఎస్​ గెలిచింది. నాలుగేండ్ల కాలపరిమితితో నిర్వహించిన ఆ ఎన్నికల గడువు 2021, అక్టోబర్​నాటికి పూర్తయింది. అయితే, టీబీజీకేఎస్ కు​ఆరు నెలల తర్వాత (2018, ఏప్రిల్)​లో గుర్తింపు హోదా సర్టిఫికెట్​ఇచ్చారు. ఆ సర్టిఫికెట్​లో కాలపరిమితి రెండేండ్లేనని పేర్కొన్నారు. దీనిపై గుర్తింపు సంఘం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర సర్కార్​ వివిధ సాకులు చూపుతూ వాయిదా వేస్తూ వచ్చాయి. గతేడాది నవంబర్​ లో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించగా, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ, మేనేజ్​మెంట్​ మరో మూడు నెలల గడువు కోరింది. ఈ క్రమంలో మూడు సార్లు వాయిదా పడిన ఎన్నికలు ఎట్టకేలకు అక్టోబర్​28న జరగబోతున్నాయి.

No comments:

Post a Comment