జీ 20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం సంతోషంగా ఉంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 September 2023

జీ 20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం సంతోషంగా ఉంది !

జీ 20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత విదేశాంగ విధానానికి ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు. ముఖ్య దేశాల అధినేతాలతో దేశంలో సమావేశం ఏర్పాటు చేయడం తాను చూడగలడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు. అలాగే ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన్మోహన్ సమర్థించారు. ఇతర దేశాల ఒత్తిడికి లొంగకుండా తటప్థ విధానాన్ని అనుసరిస్తూ మోదీ సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. దేశం ముందున్న సవాళ్లకు సంబంధించి భారతదేశ భవిష్యత్తు గురించి తాను ఆందోళన చెందడం కంటే ఆశాజనకంగా ఉన్నానని మన్మోహన్ సింగ్ అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాకపోవడం బాధాకరమన్నారు. భారత్-చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంలో మోడీ ఆచీతూచీ వ్యవహరించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు మన్మోహన్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేసిన మొదటి మూన్ మిషన్‌ను గుర్తుచేసుకున్న సింగ్, భారత అంతరిక్ష సంస్థ తన మూడవ మిషన్‌లో విజయవంతంగా మూన్ ల్యాండింగ్ చేయడాన్ని ప్రశంసించారు.

No comments:

Post a Comment