గడిచిన ఐదేళ్లలో 1.6 లక్షల మందికి కెనడా పౌరసత్వం

Telugu Lo Computer
0


కెనడా పౌరసత్వం తీసుకునే భారతీయుల సంఖ్య ప్రతియేడు పెరిగిపోతున్నది. 2018 జనవరి నుంచి 2023 జూన్‌ నడుమ గడిచిన ఐదేళ్లలో ఏకంగా 1.6 లక్షల మంది భారతీయులు భారత పౌరసత్వం వదులుకుని కెనడా పౌరసత్వం తీసుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో భారతీయులు ఎక్కువగా కెనడా పౌరసత్వం తీసుకుని వెళ్లిపోవడంతో ప్రవాస భారతీయులు అధిక ప్రాధాన్యం ఇస్తున్న డిస్టినేషన్‌ జాబితాలో కెనడా దేశం రెండో స్థానంలో నిలిచింది. అగ్ర రాజ్యం అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నది. ఇదిలావుంటే భారత్‌-కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని భారత్‌ నిలిపేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)